Sunday, January 20, 2013

జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలి

భూమిపై జీవ రూపాల భేదాన్ని జీవ వైవిధ్యం (బయోడైవర్సిటీ) అంటారు. మనదేశంలో ఉన్నంతటి విస్తృతమైన జీవవైవిధ్యం మరెక్కడా లేదు.

ప్రపంచ వైశాల్యంలో భారతదేశానిది కేవలం 2.4 శాతమే అయినప్పటికీ ప్రపంచ జీవవైవిధ్యంలో 8 శాతం కంటే ఎక్కువ మనదేశం లోనే ఉందని నిపుణుల అంచనా.ఎంతో విస్తృతంగా ఉన్న మన జీవ వైవిధ్యం ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. వివిధ జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి.
వాటిలో కాలుష్యం ఒకటైతే, వనరుల దుర్వినియోగం మరో కారణం. ఇలా జీవజాతులు నశించిపోతూ వస్తే మానవ మనుగడకే ప్రమాదం రావచ్చు.

ప్రకృతిలోని జీవులన్నీ ఒక దానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఓ ఆహర గొలుసులా ఉంటాయి. ఈ గొలుసులోని ఏ లింకు తెగినా ఆ ప్రభావం ప్రకృతిపై అతి దారుణంగా ఉంటుంది. ఆ ప్రమాదాన్ని మనమే నివారించాలి.

0 comments:

Post a Comment